Logo

యెహోషువ అధ్యాయము 24 వచనము 16

1సమూయేలు 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడనగుదును. అది నాకు దూరమగును గాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.

రోమీయులకు 3:6 అట్లనరాదు. అట్లయినయెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును?

రోమీయులకు 6:2 అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?

హెబ్రీయులకు 10:38 నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసినయెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.

హెబ్రీయులకు 10:39 అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము.

యెహోషువ 22:29 ఆయన మందిరము నెదుట నున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలి పీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగి పోయినయెడల నేమి యెహోవామీద ద్రోహము చేసినయెడల నేమి మేము శాపగ్రస్తులమగుదుము గాక.

1సమూయేలు 20:2 యోనాతాను ఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు; నాకు తెలియజేయకుండ నా తండ్రి చిన్నకార్యమే గాని పెద్దకార్యమేగాని చేయడు; నా తండ్రి ఇదెందుకు నాకు మరుగుచేయుననగా

1రాజులు 21:3 అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా

యిర్మియా 2:20 పూర్వ కాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని నేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.