Logo

యెహోషువ అధ్యాయము 24 వచనము 30

యెహోషువ 19:50 యెహోవా సెలవిచ్చిన దానినిబట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశములోనున్న తిమ్న త్సెరహును అతని కిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలోనివసించెను.

న్యాయాధిపతులు 2:9 అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషుకొండకు ఉత్తరదిక్కున నున్నది.

2సమూయేలు 23:30 పరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,

ద్వితియోపదేశాకాండము 11:29 కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను.

న్యాయాధిపతులు 1:1 యెహోషువ మృతినొందిన తరువాత ఇశ్రాయేలీయులుకనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థనచేయగా

న్యాయాధిపతులు 2:8 నూను కుమారుడును యెహోవాకు దాసుడు నైన యెహోషువ నూట పది సంవత్సరముల వయస్సుగల వాడై మృతినొందినప్పుడు అతని స్యాస్థ్యపు సరిహద్దులో నున్న తిమ్నత్సెరహులో జనులతని పాతిపెట్టిరి.

న్యాయాధిపతులు 8:32 యోవాషు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను.

న్యాయాధిపతులు 18:13 అక్కడనుండి వారు ఎఫ్రాయిమీ యుల మన్యప్రదేశమునకు పోయి మీకా యింటికి వచ్చిరి.

న్యాయాధిపతులు 19:1 ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయు డైన యొకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లె హేములోనుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చు కొనగా