Logo

న్యాయాధిపతులు అధ్యాయము 8 వచనము 1

న్యాయాధిపతులు 12:1 ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తరదిక్కునకు పోయినీవు అమ్మోనీయులతో యుద్ధము చేయ బోయి నప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువ లేదు? నీవు కాపురమున్న నీ యింటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా

న్యాయాధిపతులు 12:2 యెఫ్తానాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగిన ప్పుడు నేను మిమ్మును పిలిచితిని గాని మీరు వారిచేతులలోనుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి

న్యాయాధిపతులు 12:3 నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయు లతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నాచేతి కప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను.

న్యాయాధిపతులు 12:4 అప్పుడు యెఫ్తా గిలాదువారి నందరిని పోగుచేసికొని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారుఎఫ్రాయిమీయులకును మనష్షీ యులకును మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీ యులయెదుట నిలువక పారిపోయిన వారనిరి.

న్యాయాధిపతులు 12:5 ఎఫ్రాయి మీయులతో యుద్ధముచేయుటకై గిలాదువారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీ యులలో ఎవడోనన్ను దాటనియ్యుడని చెప్పినప్పుడు గిలాదువారునీవు ఎఫ్రాయిమీయుడవా అని అతని నడి గిరి.

న్యాయాధిపతులు 12:6 అందుకతడునేను కాను అనినయెడల వారు అతని చూచిషిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడి పోయిరి.

2సమూయేలు 19:41 ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరును రాజునొద్దకు వచ్చి మా సహోదరులగు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ యింటివారిని నీవారిని యొర్దాను ఇవతలకు తోడుకొని వచ్చిరని యడుగగా

యోబు 5:2 దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశించెదరు బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు.

ప్రసంగి 4:4 మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలె నున్నది.

యాకోబు 4:5 ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?

యాకోబు 4:6 కాదుగాని, ఆయన ఎక్కువ కృపనిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.

1సమూయేలు 24:14 ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా? మిన్నల్లిని గదా?

2సమూయేలు 19:43 అందుకు ఇశ్రాయేలు వారు రాజులో మాకు పది భాగములున్నవి; మీకంటె మేము దావీదునందు అధిక స్వాతంత్ర్యము గలవారము; రాజును తోడుకొని వచ్చుటను గురించి మీతో ముందుగా మాటలాడినవారము మేమే గదా మీరు మమ్మును నిర్లక్ష్యము చేసితిరేమి? అని యూదావారితో పలికిరి. యూదావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటలకంటె కఠినముగా ఉండెను.

సామెతలు 13:10 గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.

సామెతలు 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.

సామెతలు 15:18 కోపోద్రేకి యగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.

సామెతలు 17:14 కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు