Logo

న్యాయాధిపతులు అధ్యాయము 8 వచనము 11

సంఖ్యాకాండము 32:35 యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను

సంఖ్యాకాండము 32:42 నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.

న్యాయాధిపతులు 18:27 మీకా చేసికొనినదానిని, అతనియొద్దనున్న యాజకునిని వారు పట్టుకొని, సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతముచేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి.

1సమూయేలు 15:32 సమూయేలు అమాలేకీయులరాజైన అగగును నా దగ్గరకు తీసికొనిరండని చెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడచిపోయెనే అని చెప్పగా

1సమూయేలు 30:16 తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశములోనుండియు యూదా దేశములోనుండియు తాము దోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి.

1దెస్సలోనీకయులకు 5:3 లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు

న్యాయాధిపతులు 6:33 మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పు వారందరును కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదా నములో దిగగా

న్యాయాధిపతులు 8:10 అప్పుడు జెబహును సల్ము న్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన యించు మించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులో నుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేల మంది మనుష్యులు పడిపోయిరి.

1దినవృత్తాంతములు 2:23 మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణములను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.