Logo

న్యాయాధిపతులు అధ్యాయము 20 వచనము 12

ద్వితియోపదేశాకాండము 13:14 అది నిజమైనయెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగినయెడల

ద్వితియోపదేశాకాండము 20:10 యుధ్దము చేయుటకు మీరొక పురముమీదికి సమీపించునప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి

యెహోషువ 22:13 ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయులయొద్దకును గాదీయులయొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారియొద్దకును యాజకు డగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి.

యెహోషువ 22:14 ఇశ్రాయేలీయుల గోత్రముల న్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని, అనగా పదిమంది ప్రధానులను అతనితో కూడ పంపిరి, వారందరు ఇశ్రాయేలీయుల సమూ హములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు.

యెహోషువ 22:15 వారు గిలాదుదేశములోనున్న రూబేనీయులయొద్దకును గాదీయులయొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారియొద్ద కును పోయి వారితో ఇట్లనిరి

యెహోషువ 22:16 యెహోవా సర్వ సమాజపువారు చెప్పుచున్నదేమనగానేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని, ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేల తిరుగుబాటు చేయు చున్నారు?

మత్తయి 18:15 మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.

మత్తయి 18:16 అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము.

మత్తయి 18:17 అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.

మత్తయి 18:18 భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

రోమీయులకు 12:18 శక్యమైతే మీచేతనైనంతమట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.