Logo

న్యాయాధిపతులు అధ్యాయము 20 వచనము 47

న్యాయాధిపతులు 21:13 ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యా మీనీయులతో మాటలాడుటకును వారిని సమాధానపరచు టకును వర్తమానము పంపగా

కీర్తనలు 103:9 ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు.

కీర్తనలు 103:10 మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.

యెషయా 1:9 సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపనియెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము.

యిర్మియా 14:7 యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితివిు; మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి; నీ నామమునుబట్టి నీవే కార్యము జరిగించుము.

విలాపవాక్యములు 3:32 ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును.

హబక్కూకు 3:2 యెహోవా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.

న్యాయాధిపతులు 20:15 ఆ దినమున బెన్యామీనీయులు తమ జన సంఖ్యను మొత్తముచేయగా ఏడువందల మందియైన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులై పట్టణమునుండి వచ్చినవారు ఇరువదియారు వేలమందియైరి.

న్యాయాధిపతులు 21:14 ఆ వేళను బెన్యా మీనీ యులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గి లాదు స్త్రీలలో బ్రదుకనిచ్చినవారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలక పోగా

జెకర్యా 14:10 యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూలగుమ్మము వరకును, అనగా మొదటి గుమ్మపు కొనవరకును, హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగుల వరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపుతట్టున నున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును,