1దినవృత్తాంతములు 16: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.
అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తర్లిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను.
ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను.
వారు, అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి.
ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్యదేశములో పరదేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను.