లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 19: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని సిరియనులు తెలిసికొనినప్పుడు వారు దూతలను పంపి, యేటి ఆవలి సిరియనులను పిలిపించుకొనిరి, హదరెజెరుయొక్క సైన్యాధిపతియైన షోపకు వారికి నాయకుడాయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 2:1

అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?

యెషయా 8:9

జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.

మీకా 4:11

మనము చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి కూడి వచ్చియున్నారు.

మీకా 4:12

కళ్లములో ఒకడు పనలు కూర్చునట్టు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలిసికొనకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు.

జెకర్యా 14:1

ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును.

జెకర్యా 14:2

ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

జెకర్యా 14:3

అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.

2సమూయేలు 10:16

హదదెజరు నదియవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి.

1రాజులు 11:23

మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదదెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు.

కీర్తనలు 60:1

దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టియున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.