లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 28: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు ఆ యా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తు ప్రకారము బంగారమును, ఆ యా సేవా క్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తు ప్రకారము వెండిని దావీదు అతనికప్పగించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 29:2

నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని.

ఎజ్రా 8:33

నాలుగవ దినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితో కూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడ నుండిరి.