లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 29: 27

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 3:4

ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,

2సమూయేలు 5:4

దావీదు ముప్పది యేండ్లవాడై యేలనారంభించి నలువది సంవత్సరములు పరిపాలన చేసెను.

2సమూయేలు 5:5

హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను.

1రాజులు 2:11

దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు, హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను.

2సమూయేలు 2:11

దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు.

1రాజులు 1:1

రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్నిబట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెను.

1దినవృత్తాంతములు 26:31

హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పితరుల యింటిపెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి.