1కొరిందీయులకు 16: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" పౌలను నేను నాచేతితోనే వందన వచనము వ్రాయుచున్నాను."
సంబంధిత రిఫరెన్స్‌లు
పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.
నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.
నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.
పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.
నాతో కూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు.
క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా,
నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు.
మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు.
పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకరికి ఒకరు వందనములు చేసికొనుడి.
పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికిని సమాధానము కలుగును గాక. ఆమేన్.
నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు.
ఆ యల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తనయొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలుదేరెను.
అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు
శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.