1రాజులు 19: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తి నేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగివచ్చి నిన్ను వెంబడించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
వంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.
పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా
శిష్యులలో మరియొకడు ప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా
యేసు అతని చూచి నన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను.
మరియొకడు ప్రభువా, నీవెంట వచ్చెదను గాని నా యింటనున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా
యేసు నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.
అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు
అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దుపెట్టుకొన నియ్యక పిచ్చిపట్టి యిట్లు చేసితివి.
ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను.
జనులందరును రాజును నది యవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దుపెట్టుకొని దీవించెను; తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్లిపోయెను.
తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱల దొడ్లలోనుండి అతని పిలిపించెను.
వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
ఆయన మరియొకనితో నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను