లేఖనాలను అన్వేషించండి

1రాజులు 8: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను, ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 25:18

మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.

నిర్గమకాండము 25:20

ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచవలెను.

సంఖ్యాకాండము 4:6

దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.

2సమూయేలు 6:2

బయలుదేరి, కెరూబుల మధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటనుండి తీసికొని వచ్చుటకై తనయొద్దనున్న వారందరితో కూడ బాయిలా యెహూదాలోనుండి ప్రయాణమాయెను.

2దినవృత్తాంతములు 5:7

మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసికొని గర్భాలయమగు అతి పరిశుద్ధస్థలమందు కెరూబుల రెక్కలక్రింద దానిని ఉంచిరి.

యెషయా 6:2

ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను.

హెబ్రీయులకు 9:5

దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.