1సమూయేలు 11: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషువారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటె బలిష్టులైయుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.
యెహోషువ గిల్గాలునుండి ఆ రాత్రి అంతయు నడచి వారిమీద హఠా త్తుగాపడెను.
యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయులచేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరిని అప్ప గించెదను. నీవు వారి గుఱ్ఱముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషు వతో సెలవిచ్చెను.
అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.
ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.