లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 12: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు సమూయేలు జనులతో ఇట్లనెను మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశములోనుండి రప్పించినవాడు యెహోవాయే గదా"

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 6:26

ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు.

నెహెమ్యా 9:9

నీవు నీతిమంతుడవై యుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి.

నెహెమ్యా 9:10

ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారియెడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారియెదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధినొందితివి.

నెహెమ్యా 9:11

మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.

నెహెమ్యా 9:12

ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండినవాడవును రాత్రికాలమందు వారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయియుండి వారిని తోడుకొనిపోతివి.

నెహెమ్యా 9:13

సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలు కరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి.

నెహెమ్యా 9:14

వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతిదినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.

కీర్తనలు 77:19

నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.

కీర్తనలు 77:20

మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడిపించితివి.

కీర్తనలు 78:12

ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను.

కీర్తనలు 78:13

ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను

కీర్తనలు 78:14

పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను

కీర్తనలు 78:15

అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను.

కీర్తనలు 78:16

బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.

కీర్తనలు 78:17

అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.

కీర్తనలు 78:18

వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి.

కీర్తనలు 78:19

ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా యనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి.

కీర్తనలు 78:20

ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి.

కీర్తనలు 78:21

యెహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెను ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను.

కీర్తనలు 78:22

వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు.

కీర్తనలు 78:23

అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్ష ద్వారములను తెరచెను

కీర్తనలు 78:24

ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారికనుగ్రహించెను.

కీర్తనలు 78:25

దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.

కీర్తనలు 78:26

ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.

కీర్తనలు 78:27

ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలుగల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.

కీర్తనలు 78:28

వారి దండు మధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను.

కీర్తనలు 78:29

వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను.

కీర్తనలు 78:30

వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంక వారి నోళ్లలో నుండగానే

కీర్తనలు 78:31

దేవుని కోపము వారిమీదికి దిగెను వారిలో బలిసినవారిని ఆయన సంహరించెను ఇశ్రాయేలులో యౌవనులను కూల్చెను.

కీర్తనలు 78:32

ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్యకార్యములనుబట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి.

కీర్తనలు 78:33

కాబట్టి ఆయన, వారి దినములు ఊపిరివలె గడచిపోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడచిపోజేసెను.

కీర్తనలు 78:34

వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి.

కీర్తనలు 78:35

దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసికొనిరి.

కీర్తనలు 78:36

అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు

కీర్తనలు 78:37

నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.

కీర్తనలు 78:38

అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.

కీర్తనలు 78:39

కాగా వారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలిరాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.

కీర్తనలు 78:40

అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.

కీర్తనలు 78:41

మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.

కీర్తనలు 78:42

ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.

కీర్తనలు 78:43

ఐగుప్తులో తన సూచకక్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.

కీర్తనలు 78:44

ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను

కీర్తనలు 78:45

ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను.

కీర్తనలు 78:46

ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకప్పగించెను.

కీర్తనలు 78:47

వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడుచేసెను.

కీర్తనలు 78:48

వారి పశువులను వడగండ్ల పాలుచేసెను. వారి మందలను పిడుగుల పాలుచేసెను.

కీర్తనలు 78:49

ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను.

కీర్తనలు 78:50

తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను.

కీర్తనలు 78:51

ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను.

కీర్తనలు 78:52

అయితే గొఱ్ఱలవలె ఆయన తన ప్రజలను తోడుకొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను

కీర్తనలు 78:53

వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను.

కీర్తనలు 78:54

తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణహస్తము సంపాదించిన యీ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను.

కీర్తనలు 78:55

వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను. కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచి యిచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను.

కీర్తనలు 78:56

అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనముల ననుసరింపకపోయిరి.

కీర్తనలు 78:57

తమ పితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి.

కీర్తనలు 78:58

వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి.

కీర్తనలు 78:59

దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను.

కీర్తనలు 78:60

షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను.

కీర్తనలు 78:61

ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.

కీర్తనలు 78:62

తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను

కీర్తనలు 78:63

అగ్ని వారి యౌవనస్థులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను.

కీర్తనలు 78:64

వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.

కీర్తనలు 78:65

అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను.

కీర్తనలు 78:66

ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను.

కీర్తనలు 78:67

పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు.

కీర్తనలు 78:68

యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.

కీర్తనలు 78:69

తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను

కీర్తనలు 78:70

తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱల దొడ్లలోనుండి అతని పిలిపించెను.

కీర్తనలు 78:71

పాడిగొఱ్ఱలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను.

కీర్తనలు 78:72

అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.

కీర్తనలు 99:6

ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.

కీర్తనలు 105:26

ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను.

కీర్తనలు 105:41

బండను చీల్చగా నీళ్లు ఉబికివచ్చెను ఎడారులలో అవి యేరులై పారెను.

యెషయా 63:7

యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమునుబట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.

యెషయా 63:8

వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.

యెషయా 63:9

వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

యెషయా 63:10

అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను.

యెషయా 63:11

అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములోనుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి?

యెషయా 63:12

తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి?

యెషయా 63:13

తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించినవాడేడి? యనుకొనిరి

యెషయా 63:14

పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి

హోషేయ 12:13

ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడెను.

మీకా 6:4

ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.

నిర్గమకాండము 3:10

కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.

1సమూయేలు 12:8

యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చి యీ స్థలమందు నివసింపజేసిరి.

కీర్తనలు 136:11

వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును.

హెబ్రీయులకు 3:2

దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయన కూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.