1సమూయేలు 2: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడ వచ్చినప్పుడు దాని తెచ్చి వానికిచ్చుచు వచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
పతకము ఏఫోదు నిలువుటంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
ఇతడు షిలోహునందున్న సైన్యములకధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీయొక్క యిద్దరు కుమారులగు హొప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి.
ఎల్కానాయును అతని యింటివారందరును యెహోవాకు ఏటేట అర్పించు బలి నర్పించుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి.
సంవత్సరమునకు మూడుమారులు నాకు పండుగ ఆచరింపవలెను.
ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను.