లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 22: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" సౌలు అహీటూబు కుమారుడా, ఆలకించుమనగా అతడు చిత్తము నా యేలినవాడా అనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 22:7

సౌలు తనచుట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెను బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్షతోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా?

1సమూయేలు 22:13

సౌలు నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి, అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జతకూడితిరేమని యడుగగా

2సమూయేలు 9:6

సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతూ అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.

యెషయా 65:1

నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.

2సమూయేలు 1:7

అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా యేలినవాడా అని నేనంటిని.

యోబు 38:35

మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?

కీర్తనలు 94:20

కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా?

మత్తయి 5:22

నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహా సభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.