లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 24: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలోనుండి మూడు వేలమందిని ఏర్పరచుకొని వచ్చి, కొండమేకలకు వాసములగు శిలా పర్వతములమీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 13:2

ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచుకొనెను. వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్దనుండిరి; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్దనుండిరి; మిగిలినవారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను.

కీర్తనలు 37:32

భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.

కీర్తనలు 38:12

నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడుచేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.

కీర్తనలు 104:18

గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు

కీర్తనలు 141:6

వారి న్యాయాధిపతులు కొండ పేటుమీదనుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు.

1సమూయేలు 26:2

సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన మూడువేల మందిని తీసికొని జీఫు అరణ్యములో దావీదును వెదకుటకు జీఫు అరణ్యమునకు పోయెను.

2రాజులు 6:14

కాబట్టి రాజు అచ్చటికి గుఱ్ఱములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా

యోబు 39:1

అడవిలోని కొండమేకలు ఈను కాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?

కీర్తనలు 17:11

మా అడుగుజాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొనియున్నారు మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు.