లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 28: 1

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి నేను దండెత్తగా నీవును నీ జనులును నాతో కూడ యుద్ధమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలిసికొనుమనగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 7:7

ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలుమీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి

1సమూయేలు 13:5

ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.

1సమూయేలు 17:1

ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని శోకోలో కూడి ఏఫెస్దమ్మీము దగ్గర శోకోకును అజేకాకును మధ్యను దిగియుండగా

1సమూయేలు 29:1

అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి ఆఫెకులో దిగియుండిరి; ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జెల దగ్గర దిగియుండిరి.

న్యాయాధిపతులు 3:1

ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగినయుద్ధము లన్నిటిని చూడనివారందరిని శోధించి

న్యాయాధిపతులు 3:2

ఇశ్రాయేలీయుల తరతరములవారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడనివారికి యుద్ధముచేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి.

న్యాయాధిపతులు 3:3

ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల జనులును, కనానీయులందరును, సీదోనీయులును, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులును,

న్యాయాధిపతులు 3:4

యెహోవా మోషేద్వారా తమ తండ్రుల కిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలిసికొను నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను.

1సమూయేలు 27:12

దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తనయందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను.

1సమూయేలు 29:2

ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును నూరేసిమందిగాను వెయ్యేసిమందిగాను వ్యూహపరచి వచ్చుచుండగా దావీదును అతని జనులును ఆకీషుతో కలిసి దండు వెనుకతట్టున వచ్చుచుండిరి.

1సమూయేలు 29:3

ఫలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నాయొద్దనుండిన ఇశ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నాయొద్ద చేరిన నాటనుండి నేటివరకు ఇతనియందు తప్పేమియు నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను.

1సమూయేలు 31:1

అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుటనుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతమువరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు

1దినవృత్తాంతములు 10:1

ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి.