లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 29: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" సౌలు వేలకొలదిగాను దావీదు పదివేలకొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 18:6

దావీదు ఫిలిష్తీయుని హతముచేసి తిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలోనుండి తంబురలతోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి

1సమూయేలు 18:7

ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి.

1సమూయేలు 21:11

ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేలకొలది హతముచేసెననియు, దావీదు పదివేలకొలది హతముచేసెననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే గదా అని అతనినిబట్టి రాజుతో మాటలాడగా

సామెతలు 27:14

వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును.