2రాజులు 13: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" అంతట యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రియైన యెహోయాహాజు చేతిలోనుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసికొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరచుకొనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతట అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను.
అందు నిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి నీవు అయిదు మారులైన ఆరు మారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.
కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలువారిమీద రగులుకొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలువారిని వారికప్పగించెను.
కావున యెహోవా ఇశ్రాయేలువారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతనిచేత ఇశ్రాయేలువారు సిరియనుల వశములోనుండి తప్పించుకొని మునుపటివలె స్వస్థానములలో కాపురముండిరి.
నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను; అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును;
ఆయన పేరు యెహోవా; బలాఢ్యులమీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును.
న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతిఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి.