లేఖనాలను అన్వేషించండి

2రాజులు 17: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిననుసరించుచు వచ్చిరి గనుక"

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 3:3

ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను.

2రాజులు 10:29

అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూకూడ అందుకు కారకుడై, బేతేలు దాను అను స్థలములందున్న బంగారుదూడలను అనుసరించుట మానలేదు.

2రాజులు 10:31

అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ యేమాత్రమును విసర్జించనివాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణహృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయెను.

2రాజులు 13:2

ఇతడు ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

2రాజులు 13:6

అయినను ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబికులు చేసిన పాపములను వారు విడువక వాటిననుసరించుచు వచ్చిరి. మరియు ఆ దేవతాస్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను.

2రాజులు 13:11

ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక వాటిననుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

2రాజులు 15:9

ఇతడు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు, తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

యెహోషువ 23:13

మీ దేవుడైన యెహోవా మీ యెదుటనుండి యీ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ మీరు నశించువరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్లుగాను ఉందురు.