2రాజులు 2: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు క్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొనిరండని వారితో చెప్పెను. వారు దాని తీసికొనిరాగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను.
అయితే ఆ సముద్రపు బురద స్థలములును ఊబి స్థలములును ఉప్పుగలవైయుండి బాగుకాక యుండును.
నా జీవముతోడు మోయాబు దేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోను దేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పుగోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించుకొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే.
రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాటలాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి యుండెను.
పిమ్మట యెషయా అంజూరపుపండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపుమీద వేసినతరువాత అతడు బాగుపడెను.
ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.