లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 20: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 19:21

ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మనస్సులో ఉద్దేశించి నేనక్కడికి వెళ్లిన తరువాత రోమాకూడ చూడవలెనని అనుకొనెను.

అపోస్తలులకార్యములు 21:11

అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తనచేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనులచేతికి అప్పగింతురని పరిశుద్దాత్మ చెప్పుచున్నాడనెను

అపోస్తలులకార్యములు 21:12

ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని

అపోస్తలులకార్యములు 21:13

పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.

అపోస్తలులకార్యములు 21:14

అతడు ఒప్పుకొననందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి.

లూకా 9:51

ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు

లూకా 12:50

అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరువరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను.

2కొరిందీయులకు 5:14

క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,

లూకా 18:31

ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారునిగూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును.

లూకా 18:32

ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయనమీద ఉమ్మి వేసి,

లూకా 18:33

ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు; మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను.

యోహాను 13:1

తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగినవాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.

యోహాను 18:4

యేసు తనకు సంభవింపబోవునవన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.

యాకోబు 4:14

రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.

2పేతురు 1:14

నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.

మార్కు 10:33

ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు.

యోహాను 11:7

అటుపిమ్మట ఆయన మనము యూదయకు తిరిగివెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా

అపోస్తలులకార్యములు 8:29

అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను.

అపోస్తలులకార్యములు 9:16

ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.

అపోస్తలులకార్యములు 21:4

మేమక్కడనున్న శిష్యులను కనుగొని యేడు దినములక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలుపెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి.

అపోస్తలులకార్యములు 21:12

ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని

అపోస్తలులకార్యములు 23:11

ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టుపెట్టుకొనిరి.

రోమీయులకు 15:25

అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్యచేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.