అపోస్తలులకార్యములు 20: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయినవాడై యెత్తబడెను"
సంబంధిత రిఫరెన్స్‌లు
వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు.
అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను.
అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను.
ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడగదిలో పరుండ బెట్టిరి.
క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించియుండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున