లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 21: 36

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఏలయనగా వానిని చంపుమని జనసమూహము కేకలు వేయుచు వెంబడించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 6:11

భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి యుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.

ఆదికాండము 6:12

దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.

కీర్తనలు 55:9

పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.

కీర్తనలు 58:2

లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీచేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు.

యిర్మియా 23:10

దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది; అడవిబీళ్లు ఎండిపోయెను.

హబక్కూకు 1:2

యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపకయున్నావు.

హబక్కూకు 1:3

నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.

అపోస్తలులకార్యములు 21:40

అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్చబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను

అపోస్తలులకార్యములు 24:7

తమరు విమర్శించినయెడల

1తిమోతి 3:13

పరిచారకులై యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసు నందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు.