అపోస్తలులకార్యములు 21: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలివరకు సాగనంప వచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి."
సంబంధిత రిఫరెన్స్‌లు
అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారినడుగగా
మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.
అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను.
పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారియొద్ద ఏడు దినములు గడిపితివిు.
ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.
అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమయొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితివిు.
ప్రభువు దినమందు ఆత్మవశుడనై యుండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము
మేమనేక దినములక్కడ ఉండగా, అగబు అను ఒక ప్రవక్త యూదయనుండి వచ్చెను.
అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తనచేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనులచేతికి అప్పగింతురని పరిశుద్దాత్మ చెప్పుచున్నాడనెను
ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని
ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడనై యెరూషలేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదుగాని,
పేతురు ఆ దర్శనమునుగూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు.
ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చిరి.
ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మనస్సులో ఉద్దేశించి నేనక్కడికి వెళ్లిన తరువాత రోమాకూడ చూడవలెనని అనుకొనెను.
సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫెసును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.
బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.
ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని