లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 27: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" అనేక దినములు మెల్లగా నడచి, యెంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్యకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితివిు. "

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 27:1

మేము ఓడయెక్కి ఇటలీ వెళ్లవలెనని నిర్ణయమైనప్పుడు, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్పగించిరి.

అపోస్తలులకార్యములు 6:9

అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని

అపోస్తలులకార్యములు 18:24

అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను.

అపోస్తలులకార్యములు 28:11

మూడు నెలలైన తరువాత, ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడపిన అశ్వినీ చిహ్నముగల అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి

అపోస్తలులకార్యములు 21:2

అప్పుడు ఫేనీకేకు వెళ్లబోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితివిు.