లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 28: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 12:22

జనులు ఇది దైవస్వరమేకాని మానవస్వరము కాదని కేకలు వేసిరి.

అపోస్తలులకార్యములు 14:11

జనసమూహములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో --దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగివచ్చి యున్నారని కేకలువేసి,

అపోస్తలులకార్యములు 14:12

బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగి యైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి.

అపోస్తలులకార్యములు 14:13

పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను.

మత్తయి 21:9

జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.

మత్తయి 27:22

అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువ వేయుమని అందరును చెప్పిరి.

దానియేలు 2:46

అంతట రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్ఠాంగ నమస్కారము చేసి అతని పూజించి, నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను.