లేఖనాలను అన్వేషించండి

దానియేలు 11: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతని కుమారులు యుద్ధము చేయబూని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి యేరువలె ప్రవహించి ఉప్పొంగును; యుద్ధము చేయబూని కోటదనుక వచ్చును."

సంబంధిత రిఫరెన్స్‌లు

దానియేలు 11:5

అయితే దక్షిణ దేశపు రాజును, అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు అతడు, ఇతనికంటె గొప్పవాడై యేలును; అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును.

దానియేలు 11:11

అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును; ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును.

జెకర్యా 6:6

నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును.

ప్రకటన 17:14

వీరు గొఱ్ఱపిల్లతో యుద్ధముచేతురు గాని, గొఱ్ఱపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతో కూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.