లేఖనాలను అన్వేషించండి

దానియేలు 11: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహా బలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును. "

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 9:4

అప్పుడు వారు బయల్బెరీతు గుడిలోనుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతనికియ్యగా వాటితో అబీమెలెకు అల్లరిజనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశమున నుండిరి.

సామెతలు 17:8

లంచము దృష్టికి మాణిక్యమువలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును.

సామెతలు 19:6

అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే.

దానియేలు 7:25

ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.

సామెతలు 23:7

అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు.

యెహెజ్కేలు 38:10

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును,

మత్తయి 9:4

యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?

సామెతలు 19:21

నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము.

దానియేలు 8:23

వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి యతిక్రమములు సంపూర్తి యగుచుండగా, క్రూరముఖము గలవాడును యుక్తి గలవాడునై యుండి, ఉపాయము తెలిసికొను ఒక రాజు పుట్టును.

ప్రకటన 17:14

వీరు గొఱ్ఱపిల్లతో యుద్ధముచేతురు గాని, గొఱ్ఱపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతో కూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.