లేఖనాలను అన్వేషించండి

ఎస్తేరు 1: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయకపత్నులు రాణి చేసినదాని సమాచారము విని, రాణి పలికినట్లు ఈ దినమందు రాజుయొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును."

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 5:29

ఆమెయొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను

1రాజులు 11:3

అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉపపత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి.