లేఖనాలను అన్వేషించండి

ఎస్తేరు 6: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" హామాను తనకు సంభవించినదంతయు తన భార్యయైన జెరెషుకును తన స్నేహితులకందరికిని తెలుపగా, అతనియొద్దనున్న జ్ఞానులును అతని భార్యయైన జెరెషును ఎవనిచేత నీకు అధికారనష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపువాడైనయెడల అతనిమీద నీకు జయము కలుగదు, అతనిచేత అవశ్యముగా చెడిపోదువని ఆతనితో అనిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎస్తేరు 5:10

అయితే హామాను కోపము అణచుకొని తన యింటికిపోయి తనస్నేహితులను తన భార్యయైన జెరెషును పిలిపించి

ఎస్తేరు 5:11

తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమునుగూర్చియు, చాలామంది పిల్లలు తనకుండుటనుగూర్చియు, రాజు తన్ను ఘనపరచి రాజు క్రిందనుండు అధిపతులమీదను సేవకులమీదను తన్ను ఏలాగున పెద్దగాచేసెనో దానినిగూర్చియు వారితో మాటలాడెను.

ఎస్తేరు 5:12

మరియు అతడు రాణియైన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి యెవనిని పిలిపించలేదు, రేపటి దినమున కూడ రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను.

ఎస్తేరు 5:13

అయితే యూదుడైన మొర్దెకై రాజుగుమ్మమున కూర్చునియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటివలన నాకు ప్రయోజనమేమియు లేదని అతడు చెప్పగా

ఎస్తేరు 5:14

అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరును ఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దెకై ఉరితీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను.

ఆదికాండము 41:8

తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేకపోయెను.

దానియేలు 2:12

అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరిని సంహరింపవలెనని యాజ్ఞ ఇచ్చెను.

ఆదికాండము 40:19

ఇంక మూడు దినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను.

1సమూయేలు 28:19

యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయులచేతికి అప్పగించును; రేపు నీవును నీ కుమారులును నాతోకూడ ఉందురు అని సౌలుతో చెప్పగా

1సమూయేలు 28:20

సమూయేలు మాటలకు సౌలు బహు భయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమియు చేయక యుండినందున బలహీనుడాయెను.

యోబు 15:24

శ్రమయు వేదనయు వానిని బెదరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనునట్లు అవి వానిని పట్టుకొనును.

దానియేలు 5:26

టెకేల్‌ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి.

దానియేలు 5:27

ఫెరేన్‌ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును.

దానియేలు 5:28

బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని

జెకర్యా 12:2

నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.

జెకర్యా 12:3

ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగాచేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.

యోబు 16:2

ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు.

సామెతలు 28:18

యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.

హోషేయ 14:9

జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.

2సమూయేలు 3:1

సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను.

2సమూయేలు 13:3

అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు

1రాజులు 13:21

అంతట అతడు యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినదానిని గైకొనక

1రాజులు 20:43

ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొనినవాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను.

యోబు 18:8

వారు వాగురలమీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.

కీర్తనలు 129:5

సీయోను పగవారందరు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక.