లేఖనాలను అన్వేషించండి

ఎస్తేరు 6: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు ఇంక మాటలాడుచుండగా రాజుయొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎస్తేరు 5:8

రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా కోరికయు ననెను.

ఎస్తేరు 5:14

అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరును ఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దెకై ఉరితీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను.

ద్వితియోపదేశాకాండము 32:35

వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.

ద్వితియోపదేశాకాండము 32:36

వారికాధారము లేకపోవును.

ఎస్తేరు 2:2

యౌవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును,

ఎస్తేరు 5:5

ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవియ్యగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి.

ఎస్తేరు 7:9

రాజుముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తుగల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడి యున్నదనగా రాజు దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.