లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 16: 33

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమయొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

హెబ్రీయులకు 9:4

అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోనుచేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను

నిర్గమకాండము 16:15

ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.

నిర్గమకాండము 16:16

మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవలెననెను.

నిర్గమకాండము 16:24

మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు.

నిర్గమకాండము 16:36

ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.

1సమూయేలు 17:54

అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను.

1రాజులు 8:9

ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేకపోయెను.