లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 20: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరములవరకు కరుణించువాడనై యున్నాను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 4:37

ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను.

ద్వితియోపదేశాకాండము 5:29

వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు.

ద్వితియోపదేశాకాండము 7:9

కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను.

యిర్మియా 32:39

మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును.

యిర్మియా 32:40

నేను వారికి మేలుచేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నాయెడల భయభక్తులు పుట్టించెదను.

అపోస్తలులకార్యములు 2:39

ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.

రోమీయులకు 11:28

సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటు విషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు.

రోమీయులకు 11:29

ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.

యోహాను 14:15

మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు.

యోహాను 14:21

నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.

1యోహాను 4:19

ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.

1యోహాను 5:3

మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.

2యోహాను 1:6

మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.

నిర్గమకాండము 34:7

ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికిని కుమారుల కుమారులమీదికిని రప్పించునని ప్రకటించెను.

ద్వితియోపదేశాకాండము 13:17

నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచు

ద్వితియోపదేశాకాండము 23:8

వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరమువారు యెహోవా సమాజములో చేరవచ్చును.

ద్వితియోపదేశాకాండము 30:6

మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును.

యెహోషువ 22:5

అయితే మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయనమార్గములన్ని టిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్ర మును అనుసరించి నడుచుకొనుడి.

యెహోషువ 23:11

కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.

న్యాయాధిపతులు 5:31

యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశిం చెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు అనిపాడిరి. తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.

1రాజులు 11:35

అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను;

1రాజులు 21:21

అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను నేను నీమీదికి అపాయము రప్పించెదను; నీ సంతతివారిని నాశము చేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండ పురుషులనందరిని నిర్మూలము చేతును.

నెహెమ్యా 1:5

ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,

కీర్తనలు 103:17

ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలననుసరించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద

కీర్తనలు 145:20

యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును

యిర్మియా 11:4

ఐగుప్తుదేశములోనుండి, ఆ యినుప కొలిమిలోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును.

యిర్మియా 32:18

నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు.

దానియేలు 9:4

నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థన చేసి యొప్పుకొన్నదేమనగా ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా,

లూకా 1:50

ఆయనకు భయపడు వారిమీద ఆయన కనికరము తరతరములకుండును.

రోమీయులకు 8:28

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

యాకోబు 1:12

శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

యాకోబు 2:5

నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?