లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 31: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 28:9

మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమము చొప్పున

నిర్గమకాండము 28:10

ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నముమీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.

నిర్గమకాండము 28:11

ముద్రమీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.

నిర్గమకాండము 28:12

అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును

నిర్గమకాండము 28:13

మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను;

నిర్గమకాండము 28:14

సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను.

నిర్గమకాండము 28:15

మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధానపతకము చేయవలెను. ఏఫోదు పనివలె దాని చేయవలెను; బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.

నిర్గమకాండము 28:16

అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను.

నిర్గమకాండము 28:17

దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది;

నిర్గమకాండము 28:18

పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది;

నిర్గమకాండము 28:19

గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది;

నిర్గమకాండము 28:20

రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.

నిర్గమకాండము 28:21

ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పండ్రెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరుచొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.