లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 34: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 23:16

నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంట యొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను.

సంఖ్యాకాండము 28:16

మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ.

సంఖ్యాకాండము 28:17

ఆ నెల పదునయిదవ దినము పండుగ జరుగును. ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను.

సంఖ్యాకాండము 28:18

మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు

సంఖ్యాకాండము 28:19

అయితే యెహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొఱ్ఱపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను

సంఖ్యాకాండము 28:20

వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి.

సంఖ్యాకాండము 28:21

ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుతో రెండు పదియవవంతులను ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో ఒక్కొక్క పదియవవంతును

సంఖ్యాకాండము 28:22

మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 28:23

ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.

సంఖ్యాకాండము 28:24

అట్లే ఆ యేడు దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలెను.

సంఖ్యాకాండము 28:25

ఏడవ దినమున పరిశుద్ధసంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.

సంఖ్యాకాండము 28:26

మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.

సంఖ్యాకాండము 28:27

యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగ గొఱ్ఱపిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను

సంఖ్యాకాండము 28:28

నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను

సంఖ్యాకాండము 28:29

ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

సంఖ్యాకాండము 28:30

మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 28:31

నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను.

సంఖ్యాకాండము 29:12

మరియు ఏడవ నెల పదునయిదవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను.

సంఖ్యాకాండము 29:13

నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక, యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను.

సంఖ్యాకాండము 29:14

నూనెతో కలుపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను

సంఖ్యాకాండము 29:15

ఆ పదునాలుగు గొఱ్ఱపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా

సంఖ్యాకాండము 29:16

ఒక మేకపిల్లను అర్పింవలెను.

సంఖ్యాకాండము 29:17

రెండవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన పండ్రెండు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా,

సంఖ్యాకాండము 29:18

వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును

సంఖ్యాకాండము 29:19

పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:20

మూడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను

సంఖ్యాకాండము 29:21

విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను

సంఖ్యాకాండము 29:22

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:23

నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

సంఖ్యాకాండము 29:24

ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను

సంఖ్యాకాండము 29:25

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:26

అయిదవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

సంఖ్యాకాండము 29:27

ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను

సంఖ్యాకాండము 29:28

వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:29

ఆరవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

సంఖ్యాకాండము 29:30

ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను

సంఖ్యాకాండము 29:31

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:32

ఏడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

సంఖ్యాకాండము 29:33

ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను

సంఖ్యాకాండము 29:34

పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:35

ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయకూడదు.

సంఖ్యాకాండము 29:36

అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక మీరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

సంఖ్యాకాండము 29:37

ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱపిల్లలతోను

సంఖ్యాకాండము 29:38

వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:39

మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను.

ద్వితియోపదేశాకాండము 16:10

నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీచేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది దానినియ్యవలెను.

ద్వితియోపదేశాకాండము 16:11

అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్యనున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.

ద్వితియోపదేశాకాండము 16:12

నీవు ఐగుప్తులో దాసుడవైయుండిన సంగతిని జ్ఞాపకము చేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను.

ద్వితియోపదేశాకాండము 16:13

నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను.

ద్వితియోపదేశాకాండము 16:14

ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలెను.

ద్వితియోపదేశాకాండము 16:15

నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీచేతిపనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.

యోహాను 7:2

యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక

అపోస్తలులకార్యములు 2:1

పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.

నిర్గమకాండము 23:14

సంవత్సరమునకు మూడుమారులు నాకు పండుగ ఆచరింపవలెను.

లేవీయకాండము 23:2

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామక కాలములు ఇవి.

లేవీయకాండము 23:10

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకునియొద్దకు తేవలెను.

లేవీయకాండము 23:15

మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువకాకుండ ఏడు వారములు ఉండవలెను.

లేవీయకాండము 23:17

మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవ వంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము.

లేవీయకాండము 23:24

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను.

లేవీయకాండము 23:34

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.

సంఖ్యాకాండము 28:26

మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.

ద్వితియోపదేశాకాండము 16:9

ఏడు వారములను నీవు లెక్కింపవలెను. పంటచేనిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని యేడు వారములను లెక్కించి

ద్వితియోపదేశాకాండము 16:13

నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను.

ద్వితియోపదేశాకాండము 16:16

ఏటికి మూడు మారులు, అనగా పొంగనిరొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.

2దినవృత్తాంతములు 31:5

ఆ యాజ్ఞ వెల్లడియగుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొనివచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొనివచ్చిరి.

అపోస్తలులకార్యములు 20:16

సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫెసును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.