లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 15: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 10:15

కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను

ఆదికాండము 10:16

హివ్వీయులను అర్కీయులను సినీయులను

ఆదికాండము 10:17

అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను.

ఆదికాండము 10:18

తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.

ఆదికాండము 10:19

కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషా వరకును ఉన్నది.

నిర్గమకాండము 23:23

ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్లుచు, అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.

నిర్గమకాండము 23:24

వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు; వారి క్రియలవంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి, వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను.

నిర్గమకాండము 23:25

నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.

నిర్గమకాండము 23:26

కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను.

నిర్గమకాండము 23:27

నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వ దేశములవారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుటనుండి పారిపోవునట్లు చేసెదను.

నిర్గమకాండము 23:28

మరియు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ యెదుటనుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టను.

నిర్గమకాండము 33:2

నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను.

నిర్గమకాండము 34:11

నేడు నేను నీకాజ్ఞాపించుదాని ననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను కనానీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ యెదుటనుండి వెళ్లగొట్టెదను.

ద్వితియోపదేశాకాండము 7:1

నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్నుచేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్నుమించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత

మత్తయి 8:28

ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలోనుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేకపోయెను.

1దినవృత్తాంతములు 1:14

యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు

1దినవృత్తాంతములు 11:4

తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలేమనబడిన యెబూసునకు పోయిరి; ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి.