లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 20: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహాము నడుగగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 12:18

అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు?

ఆదికాండము 26:10

అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు గదా అనెను.

ఆదికాండము 31:26

అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారినివలె నా కుమార్తెలను కొనిపోవనేల?

2దినవృత్తాంతములు 16:3

నా తండ్రికిని నీ తండ్రికిని కలిగియున్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది, వెండిని బంగారమును నీకు పంపియున్నాను, ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను.