లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 32: 27

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన నీ పేరేమని యడుగగా అతడు యాకోబు అని చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 32:29

అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయననీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.

ఆదికాండము 35:10

అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు; ఇకమీదట నీ పేరు యాకోబు అనబడదు; నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.

కీర్తనలు 20:1

ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.

హోషేయ 12:12

యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలెనని అతడు గొఱ్ఱలు కాచెను.