ఆదికాండము 39: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" అట్లుండగా ఒకనాడు అతడు తన పనిమీద ఇంటి లోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు."
సంబంధిత రిఫరెన్స్‌లు
వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటికొరకు కనిపెట్టును.
అది తెలివిలేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.
యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.
తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను, నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.
ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులనుగూర్చి మాటలాడుటయైనను అవమానకరమైయున్నది.
అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా
వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని యింటి మార్గమున నడుచుచుండెను.