లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 45: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరీలాగు చేయుడి, మీ పశువులమీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 42:25

మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడల నిట్లు జరిగించెను.

ఆదికాండము 42:26

వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదలమీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి.

ఆదికాండము 44:1

యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు,

ఆదికాండము 44:2

కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహనిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను.

ఆదికాండము 45:23

అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును తిను బండములను మోయుచున్న పది ఆడు గాడిదలను పంపెను

ద్వితియోపదేశాకాండము 23:7

ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశములో నీవు పరదేశివైయుంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు.