ఆదికాండము 47: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరు యోసేపు నొద్దకు వచ్చి మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతనియొద్దకు వచ్చి ఇది మా యేలినవారికి మరుగుచేయము; ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలును ఏలినవారి వశమాయెను, ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలినవారి సముఖమున మిగిలియుండలేదు.
నీ కన్నుల యెదుట మా పొలములును మేమును నశింపనేల? ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము; మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము; మేము చావక బ్రదుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనములిమ్మని అడిగిరి.
పంటలో అయిదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపువారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై యుండునని ప్రజలతో చెప్పగా
అతడునా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహార మునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా
అక్కడనుండి అతడు పెనూయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతని కుత్తరమిచ్చిరి గనుక అతడు
నీయొద్ద ఏమియున్నది? అయిదు రొట్టెలుగాని మరేమియుగాని యుండినయెడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా
నీ పనివారిని నీవు అడిగినయెడల వారాలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితివిు గదా; నీ కిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము.
యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము
పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును.
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువపెట్టితివిు గనుక మీయొద్ద ధాన్యము తీసికొందుమనిరి.