లేఖనాలను అన్వేషించండి

యోబు 16: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు. ఇదికూడ నామీద సాక్ష్యముగా నున్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 10:17

సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు.

ఎఫెసీయులకు 5:27

నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.

కీర్తనలు 106:15

వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను.

యెషయా 10:16

ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపును వారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును.

యెషయా 24:16

నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమునుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు.

విలాపవాక్యములు 3:4

ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు

యాకోబు 5:3

మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి.