యోబు 18: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేవు వెదకుదురు? మీరు ఆలోచనచేసి ముగించినయెడల మేము మాటలాడెదము."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎంతకాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను.
ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?
మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.
దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము నాలకించుడి.
ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు.
ఈ గాలిమాటలు ముగిసిపోయెనా? నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?
చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమయొద్దకు తీసికొనును గాక. మేఘము దాని కమ్మును గాక పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదరించును గాక
అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక సంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాక మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక.
అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు
నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.
యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము.
సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.
నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
అబ్నేరు కేకవేసి కత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువు గదా; తమ సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందువని యోవాబుతో అనెను.
ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?
యోబూ, చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడెదను.