లేఖనాలను అన్వేషించండి

యోబు 19: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన నామీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 32:22

నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.

కీర్తనలు 89:46

యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?

కీర్తనలు 90:7

నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.

యోబు 13:24

నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి? నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?

యోబు 16:9

ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను. ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.

యోబు 33:10

ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.

విలాపవాక్యములు 2:5

ప్రభువు శత్రువాయెను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటిని నాశనము చేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యూదాకుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు.

ఆదికాండము 42:14

అయితే యోసేపు మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే.

యోబు 31:35

నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.

యిర్మియా 30:14

నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్నుగూర్చి విచారింపరు.