లేఖనాలను అన్వేషించండి

యోబు 26: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 20:21

ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా

నిర్గమకాండము 33:20

మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.

నిర్గమకాండము 33:21

మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను.

నిర్గమకాండము 33:22

నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నాచేతితో నిన్ను కప్పెదను;

నిర్గమకాండము 33:23

నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.

నిర్గమకాండము 34:3

ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు; ఏ నరుడును ఈ కొండమీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొఱ్ఱలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను.

1రాజులు 8:12

సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

కీర్తనలు 97:2

మేఘాంధకారములు ఆయనచుట్టు నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.

హబక్కూకు 3:3

దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయుచున్నాడు.(సెలా.) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.

హబక్కూకు 3:4

సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తములనుండి కిరణములు బయలువెళ్లుచున్నవి అచ్చట ఆయన బలము దాగియున్నది.

హబక్కూకు 3:5

ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి

1తిమోతి 6:16

సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.

యోబు 36:32

ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును

యోబు 37:21

ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ యిప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనుపరచును.

కీర్తనలు 147:8

ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు