యోబు 3: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది."
సంబంధిత రిఫరెన్స్‌లు
వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.
దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.
అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.
నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను.
భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.
మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతినుండి విడిపించితివి. నీవీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి.
మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీమీదికి ఖడ్గము రప్పించెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.