లేఖనాలను అన్వేషించండి

యోబు 34: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి"

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 1:5

జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసికొనును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.

1కొరిందీయులకు 10:15

బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి

1కొరిందీయులకు 14:20

సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.

యోబు 13:6

దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము నాలకించుడి.

యోబు 15:17

నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును నేను చూచినదానిని నీకు వివరించెదను.

యోబు 21:2

నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.

యోబు 33:1

యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము.

యోబు 34:10

విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము

యోబు 34:34

వివేచన గలవారు జ్ఞానముగలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు